నాకు ఏ సమస్య వచ్చినా పవన్ కల్యాణ్ కు చెప్పుకుంటా: సినీ రచయిత కోన వెంకట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకు ఏ సమస్య వచ్చినా పవన్ కల్యాణ్ కు చెప్పుకుంటా: సినీ రచయిత కోన వెంకట్

‘నాకు ఏ సమస్య వచ్చినా మొదట పవన్ కల్యాణ్ కు చెప్పుకోవడానికి ఇష్టపడతా’ అని ప్రముఖ మాటల రచయిత, దర్శకుడు, నిర్మాత కోన వెంకట్ అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, ‘నాకు ఏదైనా ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా ముందుగా పవన్ కల్యాణ్ కు చెప్పుకుంటా. ఆయన బాగా బిజీగా ఉంటారు కనుక, టైమ్ ఇచ్చినప్పుడు పవన్ కు చెప్పుకుంటాను. పవన్ అంతా విన్న తర్వాత.. ఒకేఒక మాటతో సమస్యకు పరిష్కారం చెప్పేస్తారు. అందుకే, మన వెనకాల ఒక శక్తి ఉంది.. అంతా అది చూసుకుంటుంది అని అనుకుంటూ ఉంటాను. ఇక, పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ, నేను ప్రతిసారి కొంత స్క్రిప్ట్ రాసుకోవడం.. కొన్ని రోజుల తర్వాత దాన్ని చించేయడం జరుగుతోంది. ఎందుకంటే, నేను స్క్రిప్ట్ రాసేటప్పుడు పవన్ ను ఒక స్థాయిలో ఊహించి మొదలు పెడతాను. కొద్దో గొప్పో స్క్రిప్ట్ పూర్తయ్యే సరికి, పవన్ స్థాయి పెరిగిపోతూ ఉంటుంది. దీంతో, రాసిన స్క్రిప్ట్ ను పక్కనపడేయటం.. మళ్లీ కొత్తది మొదలుపెట్టడం జరుగుతోంది’ అని కోన వెంకట్ నవ్వుతూ చెప్పారు.

More Telugu News