Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మేము కావాలో.. పాకిస్థాన్ కావాలో తేల్చుకోండి: చైనాకు బీజేపీ నేత హెచ్చరిక

ఉగ్రవాదం, ద్వైపాక్షిక బంధం ఒకే మార్గంలో ప్రయాణించలేవని, భారత్, పాకిస్థాన్ దేశాల్లో ఎవరు కావాలన్నది చైనా తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని బీజేపీ అధికార ప్రతినిధి నళిన్ కోహ్లీ వ్యాఖ్యానించారు. సాంకేతిక కారణాలున్నాయన్న సాకును చూపుతూ, జైషే మహ్మమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను ఉగ్రవాదిగా ప్రకటించకుండా ఐరాసను చైనా తన వీటో హక్కుతో అడ్డుకున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఉగ్రవాదంపై పోరాడుతున్న ఇండియాతో ద్వైపాక్షిక బంధం కావాలో లేదా, ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాక్ తో చెలిమే కావాలో చైనా నిర్ణయించుకోవాలని ఆయన అన్నారు. పాక్ తో బంధాన్ని కొనసాగించాలని భావిస్తే, అది ఇండియా - చైనా మధ్య ఉన్న బలమైన వ్యాపార బంధం తెగేందుకు కారణమవుతుందని గమనించాలని ఆయన హెచ్చరించారు.

More Telugu News