ఆ లక్షణాలు ప్రతి హీరోయిన్‌కూ ఉండాలి.. కాజల్ అగర్వాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ లక్షణాలు ప్రతి హీరోయిన్‌కూ ఉండాలి.. కాజల్ అగర్వాల్

మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఖైదీ నంబర్ 150’తో పాటు మరో మూడు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న హీరోయిన్ కాజల్ అగర్వాల్.. నాయికలకు ఉండాల్సిన లక్షణాల గురించి వివరించింది. ‘‘నేర్చుకోవడం, మార్పు కోరుకోవడం, మనల్ని మనం ఆవిష్కరించుకోవడం’’.. ఈ లక్షణాలు ప్రతి హీరోయిన్‌లోనూ ఉండాలని పేర్కొంది. తాను సినీ పరిశ్రమలోకి వచ్చి పదేళ్లు కావస్తున్నా ఇంకా నేర్చుకుంటూనే ఉన్నానని తెలిపింది. ప్రతీ రోజూ అప్‌డేట్ అవుతుంటానని, కొత్తగా ఇంకేమి చేయగలమనే విషయాన్ని ఆలోచిస్తుంటానని కాజల్ పేర్కొంది. చందమామ, మగధీర, మిస్టర్ పెర్‌ఫెక్ట్, బృందావనం, తుపాకీ వంటి సినిమాలు చేసినా నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేయడం లేదనే విమర్శ తనపై ఉందని, అందుకే కథల ఎంపికపై ఇక నుంచి మరింతగా దృష్టి సారించాలని అనుకుంటున్నట్టు తెలిపిందీ ముద్దుగుమ్మ. కథ కన్విన్సింగ్‌గా ఉందా? లేదా? ఆ పాత్రకు న్యాయం చేయగలనా? అనే ఆలోచిస్తాను తప్ప, మరో హీరోయిన్ గురించి ఆలోచించనని కాజల్ వివరించింది. తన మెదడు కంటే హృదయం చాలా గట్టిదని పేర్కొన్న కాజల్ టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుండాలని సలహా ఇచ్చింది.

More Telugu News