ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో చేరిన 'అయ్యో'!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో చేరిన 'అయ్యో'!

'అయ్యో...' దక్షిణాదిలో ఆశ్చర్యం, విచారం తదితర ఎన్నో సందర్భాలను వ్యక్తం చేయాల్సి వచ్చిన వేళ సర్వ సాధారణంగా వినియోగించే పదం. ఇప్పుడు 'అయ్యో' అన్న పదం ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ తాజా ఎడిషన్ లో చేర్చారు. 'అయ్యో'తో పాటు 'అయ్యా', 'యోగాసన' పదాలు కూడా స్థానం సంపాదించుకున్నాయి. ఈ విషయాన్ని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ప్రకటించింది. ప్రస్తుత డిక్షనరీలో 6 లక్షలకు పైగా పదాలున్నాయని తెలిపింది. ఇదే ఎడిషన్ లో 'స్క్రమ్ డిడ్లీ స్టంప్షియస్' (scrumdiddlyumptious) అన్న పదాన్ని కూడా జోడించినట్టు తెలిపింది. ఈ పదానికి రుచికరమైన (delicious) అన్న అర్థం వస్తుందని వెల్లడించింది.

More Telugu News