జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి మేయర్ హల్‌చల్.. రోడ్ల మరమ్మతు పనుల పరిశీలన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి మేయర్ హల్‌చల్.. రోడ్ల మరమ్మతు పనుల పరిశీలన

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో గురువారం అర్ధరాత్రి జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ హల్‌చల్ చేశారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్దకు చేరుకుని రోడ్డు మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలకు రోడ్లు గుంతలమయంగా మారాయన్నారు. రోడ్ల మరమ్మతు పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా దృష్టిసారించినట్టు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మతు చేపట్టినట్టు పేర్కొన్నారు. త్వరలోనే నగరంలోని దెబ్బతిన్న రోడ్లన్నింటికీ మరమ్మతులు పూర్తిచేస్తామని రామ్మోహన్ పేర్కొన్నారు.

More Telugu News