పాక్ కు దిమ్మ తిరిగే షాక్.. పీవోకేలో సర్జికల్ స్ట్రయిక్స్ ను ధ్రువీకరించిన మీర్పూర్ ఎస్పీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాక్ కు దిమ్మ తిరిగే షాక్.. పీవోకేలో సర్జికల్ స్ట్రయిక్స్ ను ధ్రువీకరించిన మీర్పూర్ ఎస్పీ

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) లో సర్జికల్ స్ట్రయిక్స్ జరగలేదంటూ వాదిస్తున్న పాకిస్థాన్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఈ దాడులు జరిగాయంటూ పీఓకే లోని మీర్పూర్ ఎస్పీ గులాం అక్బర్ ధ్రువీకరించారు. సెప్టెంబర్ 29న సర్జికల్ స్ట్రయిక్స్ జరిగాయంటూ బలమైన ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ మేరకు ఆయన చెప్పిన విషయాలు ఆడియో రికార్డు ద్వారా లభ్యమయ్యాయి. కాగా, తాజాగా చేసిన ఈ ప్రకటనతో అటు పాకిస్థాన్ నేతలకు, ఇటు మన దేశంలోని ప్రతిపక్ష రాజకీయపార్టీల నేతలకు సరైన సమాధానం చెప్పినట్లయింది. ఎందుకంటే, ఈ దాడులు జరగలేదంటూ వారు చేస్తున్న వాదనలకు ఈ ప్రకటన ద్వారా ఇకపై తాళం పడనుంది.

More Telugu News