ద్వారకాతిరుమలలో విషాదం.. లారీ లోంచి రేకులు జారిపడి ఇద్దరు ప్రయాణికుల మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ద్వారకాతిరుమలలో విషాదం.. లారీ లోంచి రేకులు జారిపడి ఇద్దరు ప్రయాణికుల మృతి

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం గున్నంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. రేకుల లోడ్‌తో వెళ్తున్న లారీలో ఇద్దరు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. లారీలో ఉన్న రేకులు ప్రమాదవశాత్తు ప్రయాణికులపై పడడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. రేకులు కింద ఇరుక్కుపోయిన ప్రయాణికులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News