Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స‌రిహ‌ద్దుల్లో కొనసాగుతున్న పాక్ కాల్పులు... కశ్మీర్ లో ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ద‌ల్బీర్ సింగ్

స‌రిహ‌ద్దుల్లో పాక్ క‌వ్వింపు చ‌ర్య‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈరోజు ఉద‌యం 4 గంట‌ల‌కు జ‌మ్ముక‌శ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో కాల్పులు మొద‌లు పెట్టిన పాకిస్థాన్ ఇప్ప‌టికీ వాటిని జ‌రుపుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌, భారత్ సరిహద్దుల్లో నెల‌కొన్న ఆందోళ‌నక‌ర ప‌రిస్థితుల దృష్ట్యా ఆ ప్రాంతానికి ఇప్ప‌టికే భారీగా భ‌ద్ర‌తా బ‌ల‌గాలు చేరుకున్న విష‌యం తెలిసిందే. భార‌త్ అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ పాక్ దుస్సాహ‌సానికి దిగుతోంది. ఈ నేపథ్యంలో, ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ద‌ల్బీర్ సింగ్ అక్క‌డి ప‌రిస్థితిని స‌మీక్షించ‌డానికి జ‌మ్ముక‌శ్మీర్ చేరుకున్నారు. అక్క‌డి ఆర్మీ అధికారులకు ఆయన పలు సూచనలు చేయనున్నట్లు సమాచారం. జ‌మ్ముక‌శ్మీర్ తో పాటు ఇతర స‌రిహ‌ద్దు ప్రాంతాల భద్ర‌త‌పై ఆయ‌న స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

More Telugu News