: 'బాహుబలి' కామిక్ సిరీస్ విడుదల చేస్తున్నాం: రాజమౌళి


హైఎండ్ వాల్యూస్ తో 'బాహుబలి కామిక్ సిరీస్'ను విడుదల చేస్తున్నామని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెలిపారు. హైదరాబాదులోని దసపల్లా హోటల్ లో జరిగిన 'లోగో' ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 'బాహుబలి కన్ క్లూజన్'తో పాటు కామిక్ సిరీస్ ను కూడా విడుదల చేస్తున్నామని చెప్పారు. ఈ కామిక్ సిరీస్ కు, 'బాహుబలి' సినిమాకు సంబంధం లేదని, గ్రాఫిక్ ఇండియా అనే సంస్థ కామిక్ సిరీస్ ను రన్ చేస్తుందని ఆయన చెప్పారు. దీనికి కేవలం 'బాహుబలి' క్రేజ్ ను మాత్రమే వాడుకుంటారని, కథ, గ్రాఫిక్స్, కథనం, పాత్రలు ఇలా ప్రతి విషయం వారే చూసుకుంటారని రాజమౌళి తెలిపారు. ఈ కామిక్ ప్రాజెక్టుకు తనకు పెద్దగా సంబంధాలు ఉండవని ఆయన చెప్పారు. కావాలంటే సలహాలు ఇస్తానని ఆయన చెప్పారు. హాలీవుడ్ సినిమాలకు కామిక్ సిరీస్ లు ఎలా విడుదలవుతాయో 'బాహుబలి'కి కూడా అలాంటివే కామిక్ సిరీస్ విడుదల అవుతాయని ఆయన

  • Loading...

More Telugu News