భారత సైన్యం దాడుల్లో మృతి చెందిన ‘పాక్’ ఉగ్రవాదుల మృతదేహాలకు రహస్య ఖననం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారత సైన్యం దాడుల్లో మృతి చెందిన ‘పాక్’ ఉగ్రవాదుల మృతదేహాలకు రహస్య ఖననం

భారత సైన్యం జరిపిన నిర్దేశిత దాడుల్లో మృతి చెందిన ఉగ్రవాదుల మృతదేహాలను పాకిస్థాన్ ఆర్మీ ఈరోజు రహస్యంగా ఖననం చేసినట్లు సమాచారం. ఈ దాడుల్లో మృతి చెందిన ఉగ్రవాదులు ‘జైషే-ఇ-మహ్మద్’, ‘లష్కర్-ఏ-తోయిబా’,‘హిజ్బుల్ ముజాహిదీన్’ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారని తెలుస్తోంది. దాడి జరిగిన ప్రాంతాలకు సమీపంలోనే వారి మృతదేహాలను ఖననం చేశారని, ఈ పనులన్నింటిని పాక్ ఆర్మీ హడావుడిగా ముగించిందని భారత నిఘా వర్గాల సమాచారం.

More Telugu News