Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓటుకు నోటు కేసు.. మరికొద్ది సేపట్లో ఏసీబీ కోర్టుకు రేవంత్ రెడ్డి

ఓటుకు నోటు కేసులో టీడీపీ నేత రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా లు ఈరోజు ఏసీబీ కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. హైదరాబాద్ పాతబస్తీలోని ఏసీబీ కోర్టులో ఈ కేసు విచారణ జరగనుంది. కాగా, ఈ కేసు విచారణకు హాజరుకావాల్సిందిగా గత నెలలోనే వారికి ఏసీబీ సమన్లు జారీ చేసింది. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం 10.30 గంటలకు వీరు కోర్టు ముందు హాజరుకానున్నారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ ఇప్పటికే చార్జ్ షీట్ దాఖలు చేసింది.

More Telugu News