: 'హర్షవర్ధన్' నౌక సేఫ్... కాసేపట్లో అండమాన్ కు!


నిన్న విశాఖ నుంచి అండమాన్ కు బయలుదేరి బంగాళాఖాతంలో ఆగిన 'హర్షవర్ధన్' నౌక క్షేమంగా ఉందని, మధ్యాహ్నం 2 గంటల తరువాత అండమాన్ కు బయలుదేరుతుందని విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కృష్ణబాబు తెలిపారు. నౌకలో టెక్నికల్ సమస్య ఏర్పడిందని, సాంకేతిక నిపుణులతో పాటు, నౌకలో వున్న 560 మంది ప్రయాణికులకు ఆహారాన్ని పంపించామని వెల్లడించారు. కాగా, నిన్న మధ్యాహ్నం 1:30 గంటలకు పోర్ట్ బ్లెయిర్ బయలుదేరిన నౌక, ఆరు గంటల ప్రయాణం అనంతరం నడి సముద్రంలో ఆగిన సంగతి తెలిసిందే. ఈ ప్రయాణికుల్లో అత్యధికులు అండమాన్ దీవుల్లో ఉపాధిని పొందుతున్న ఉత్తరాంధ్ర వారే.

  • Loading...

More Telugu News