ఇకపై రద్దీగా ఉండే ప్రాంతాల్లో ‘గూగుల్’ ఇంటర్నెట్ సేవలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇకపై రద్దీగా ఉండే ప్రాంతాల్లో ‘గూగుల్’ ఇంటర్నెట్ సేవలు

ప్రముఖ సెర్చ్ ఇంజన్ ‘గూగుల్’ ప్రస్తుతం భారత్ లోని 53 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ‘గూగుల్’ తన సేవలను విస్తరించనుంది. ఇందులో భాగంగానే గూగుల్ స్టేషన్ పేరుతో భారత్ లో సర్వీసులు ప్రారంభించింది. రద్దీగా ఉండే ప్రాంతాలైన మాల్స్, కేఫ్స్, యూనివర్శిటీలు, ట్రాన్సిట్ స్టేషన్స్ తదితర స్థలాలను ఎంపిక చేసి అక్కడ వైఫై సేవలను అందించనుంది. కాగా, ప్రజలకు ఉచిత వైఫై ఇంటర్నెట్ సేవలను అందించేందుకు గాను ‘గూగుల్’ సంస్థ వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి మనదేశంలోని 100 రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయం కల్పించాలనేది ‘గూగుల్’ లక్ష్యంగా ఉంది.

More Telugu News