తల్లి, చెల్లి కలిసి పరువు తీస్తున్నారన్న ఆగ్రహంతో ఇద్దరినీ చంపేశాడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తల్లి, చెల్లి కలిసి పరువు తీస్తున్నారన్న ఆగ్రహంతో ఇద్దరినీ చంపేశాడు!

సొంత తల్లి, తోడబుట్టిన చెల్లి కలిసి వ్యభిచారం చేస్తుండటాన్ని తట్టుకోలేకపోయిన ఓ యువకుడు వారిద్దరినీ తుపాకితో కాల్చి చంపిన ఘటన న్యూఢిల్లీలో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, ఢిల్లీ నజాఫ్ గఢ్ పరిధిలోని ప్రేమ్ నగర్ కు చెందిన 40 సంవత్సరాల సునీత, ఆమె 15 ఏళ్ల కూతురు వ్యభిచారం చేస్తున్నారు. దీంతో తన పరువు పోతోందన్న ఆగ్రహంతో సునీత కుమారుడు సుమీత్ వారిని చంపాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితులు ధర్మాబీర్, ప్రదీప్ లతో కలసి ప్లాన్ చేశాడు. రాజస్థాన్ లోని ఖటుశ్యాం దేవాలయానికి వెళ్దామని చెప్పి తల్లిని, చెల్లెలినీ తీసుకుని మార్గమధ్యంలో మనేసర్ సమీపంలోని పారిశ్రామిక టౌన్ షిప్ ప్రాంతంలో దేశవాళీ తుపాకులతో వారిని హత్య చేశారు. అనంతరం మృతదేహాలను అక్కడే పడేసి వెనక్కు వచ్చారు. గుర్తు తెలియని యువతుల హత్య కేసుగా ప్రారంభమైన పోలీసుల విచారణ, వారెవరో తెలుసుకోవడంతో అసలు విషయం వెల్లడైంది. సుమిత్ ను ఇంటరాగేట్ చేస్తే నేరం అంగీకరించాడు. వీరి నుంచి హత్యకు వాడిన ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆరేళ్ల క్రితం తన తండ్రికి తల్లే స్వయంగా విషం పెట్టి చంపితే, పోలీసులు కేసు పెట్టలేదని సుమిత్ ఆరోపించడం గమనార్హం.

More Telugu News