నాగ చైతన్య, సమంతా కలిసి చేసిన పూజపై అభిమానుల ఆసక్తి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాగ చైతన్య, సమంతా కలిసి చేసిన పూజపై అభిమానుల ఆసక్తి!

సినీ ప్రేమికులు నాగ చైతన్య, సమంతాల వివాహం వచ్చే ఏడాది జరగనుంది. ఈ విషయాన్ని వాళ్లిద్దరితో పాటు, నాగార్జున కూడా ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, నాగ చైతన్య, సమంతలు ఇటీవల హిందూ ఆచారం ప్రకారం ఒక పూజ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో ఈ పూజ గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. చైతూ, సమంతాలు కుంకుమ బొట్లు పెట్టుకుని పక్కపక్కనే కూర్చుని ఉన్న ఒక ఫొటో; వీరిద్దరితో పాటు నాగార్జున, వేదపండితులు నిలబడి పోజ్ ఇస్తున్న మరో ఫొటో ఉన్నాయి. పెళ్లికి ముందు జరిపే పూజ అని కొందరు, దోష నివారణ నిమిత్తం చేసే పూజ అని మరికొందరు అంటుండటం గమనార్హం. ఏమైనా, జన్మతః క్రిస్టియన్ అయిన సమంత హిందూ పద్ధతిలో జరిగిన పూజలో పాల్గొనడం విశేషమే!

More Telugu News