ఆదాయపు పన్ను చెల్లింపులపై కమెడియన్ కపిల్ శర్మను తమిళంలో ప్రశ్నించి ఇబ్బంది పెట్టిన హీరోయిన్ తమన్నా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆదాయపు పన్ను చెల్లింపులపై కమెడియన్ కపిల్ శర్మను తమిళంలో ప్రశ్నించి ఇబ్బంది పెట్టిన హీరోయిన్ తమన్నా

ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్ లు తమ తాజా బాలీవుడ్ చిత్రం 'తూటక్ తూటక్ తూటియా' ప్రమోషన్ కోసం కమెడియన్ కపిల్ శర్మ షోలో పాల్గొన్న వేళ, అందాల నటి తమన్నా, కపిల్ ను తెగ ఇబ్బంది పెట్టేసిందట. తన భవన నిర్మాణానికి ముంబై మునిసిపల్ సిబ్బంది లంచం అడిగారని, తాను సంవత్సరానికి రూ. 15 కోట్ల పన్ను కట్టినా, తన నుంచి రూ. 5 లక్షలు ఆశించారని కపిల్ ఆరోపించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక తమన్నాకు ఆయన నిజంగా ఏడాదికి అంత పన్ను కడతారా? అన్న డౌట్ వచ్చింది. ఇదే విషయాన్ని కపిల్ ను తమిళంలో ప్రశ్నించింది. తమన్నా ఏం అడిగిందో ఒక్క ముక్క కూడా అర్థం కాని కపిల్, అక్కడే ఉన్న ప్రభుదేవాను బతిమాలి మరీ ఆ ప్రశ్న ఏంటో తెలుసుకున్నాడు. ఇక ఇదే విషయాన్ని తమన్నా తన ట్విట్టర్ ఖాతాలో చెబుతూ, ఈ షోలో తాను పొట్టచెక్కలయ్యేలా నవ్వానని తెలిపింది.

More Telugu News