ఏలూరు కలెక్టరేట్ వద్ద కలకలం.. పోలీసుల వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏలూరు కలెక్టరేట్ వద్ద కలకలం.. పోలీసుల వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నం

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు క‌లెక్ట‌రేట్ వ‌ద్ద ఈరోజు ఉద‌యం క‌ల‌క‌లం రేగింది. పురుగుల మందు చేతిలో పెట్టుకుని వ‌చ్చిన‌ అచ్యుతనాథ‌రాజు అనే వ్యక్తి ఆ కార్యాలయం ముందు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు. పోలీసుల వేధింపులు తాళ‌లేకే తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్లు లేఖ రాసి ఈ ప్ర‌య‌త్నం చేశాడు. దీనిని గ‌మ‌నించిన అక్క‌డి సిబ్బంది అత‌డిని వెంట‌నే ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించి, చికిత్స అందిస్తున్నారు. అతడి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు మీడియాకు తెలిపారు. ఈ విష‌యాన్ని అచ్యుత‌నాథ‌రాజు కుటుంబ స‌భ్యుల‌కు తెలియజేశారు.

More Telugu News