ప్రభుత్వం చెప్పినా సెలవివ్వని స్కూల్... 40 మంది విద్యార్థులతో నడుములోతు నీటిలో కూరుకున్న స్కూల్ బస్సు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభుత్వం చెప్పినా సెలవివ్వని స్కూల్... 40 మంది విద్యార్థులతో నడుములోతు నీటిలో కూరుకున్న స్కూల్ బస్సు

భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవులిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోని ఓ పాఠశాల, చిన్నారుల ప్రాణాలను పణంగా పెట్టింది. కూకట్ పల్లి పరిధిలోని శుభోదయా కాలనీకి చెందిన రాఘవ కాన్సెప్ట్ స్కూల్ బస్సు ఈ ఉదయం 40 మంది చిన్నారులతో ప్రయాణిస్తూ, ధరణినగర్ ప్రాంతంలో వరదనీటిలో చిక్కుకుపోయింది. బస్సు ఇంజన్ లోకి నీరు చేరడంతో ఓ కాలనీ రోడ్డు మధ్యలోనే చిన్నారులతో సహా బస్సు నిలిచిపోయింది. దీంతో అందులోని పిల్లలు ఏడుపు లంఘించుకున్నారు. వెంటనే చుట్టు పక్కల స్థానికులు నడుములోతు నీటిలోకి దిగి, ఆ బస్సును నెట్టుకుంటూ కాస్తంత ఎత్తయిన ప్రాంతానికి చేర్చారు. ఇంత భారీ వర్షం, వరద నీటిలో స్కూలు తెరవడం, ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేయడంపై చర్యలు తీసుకోనున్నట్టు విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు.

More Telugu News