: వెంటపడి తరుముతున్న వరుణుడు... బంగాళాఖాతంలో మరో అల్పపీడనం


ఇప్పటికే వరుణుడి ఆగ్రహానికి గురై, గడచిన నాలుగు రోజులుగా అవస్థలు పడుతున్న తెలుగువారికి మరిన్ని రోజుల పాటు వాన ఇబ్బందులు తప్పేలా లేవు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీనికితోడుగా విదర్భ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో వచ్చే రెండు మూడు రోజుల్లో తెలంగాణ, ఏపీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికీ హైదరాబాద్ లోని పలు లోతట్టు కాలనీల్లోని అపార్టుమెంట్లు వరదముంపు నుంచి బయట పడలేదు. ఈ సమయంలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని వస్తున్న వార్తలతో ప్రజలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శుక్రవారం రాత్రి నుంచి తేలికపాటి జల్లులు కురుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ జిల్లాలతో పాటు ఏపీలోని ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

  • Loading...

More Telugu News