Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపు 15 నిమిషాల ముందుగానే మొదలుకానున్న టెస్ట్ మ్యాచ్.. ఓవర్లు కూడా పెరిగాయ్!

కాన్పూర్ వేదికగా గ్రీన్ పార్క్ స్టేడియంలో కొనసాగుతున్న భారత్-న్యూజిలాండ్ క్రికెట్ టెస్ట్ మ్యాచ్‌కు ఈరోజు వ‌రుణుడు అడ్డుత‌గిలాడు. రెండో రోజయిన ఈరోజు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను కివీస్ జ‌ట్టు 318 పరుగుల వద్ద ఆలౌట్‌ చేసింది. ఆ త‌రువాత బ్యాటింగ్ ప్రారంభించిన‌ న్యూజిలాండ్ టీమ్ మ‌ధ్యాహ్నం టీ విరామ సమయానికి వికెట్‌ నష్టానికి 152 పరుగులు చేసింది. అయితే, మైదానంలో వ‌ర్షం ప‌డుతుండ‌డంతో ఈరోజు ఇంకా 36 ఓవర్ల ఆట మిగిలి ఉండ‌గానే రెండో రోజు ఆట ముగిసింద‌ని అంపైర్లు ప్రకటించారు. అయితే, రేపు మ్యాచ్ 15 నిమిషాలు ముందుగానే ప్రారంభం కానుంది. అలాగే మ‌రో 8 ఓవర్లు అదనంగా పెంచుతున్న‌ట్లు అంపైర్లు పేర్కొన్నారు. దీంతో రేపు ఉదయం 9.15కే ఆట‌ను ప్రారంభించనున్నారు.

More Telugu News