హెలికాప్టర్ షాట్ కొట్టడానికి పదినెలలు ప్రాక్టీసు చేశా: సుషాంత్ సింగ్ రాజ్ పుత్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హెలికాప్టర్ షాట్ కొట్టడానికి పదినెలలు ప్రాక్టీసు చేశా: సుషాంత్ సింగ్ రాజ్ పుత్

ధోనీలా హెలికాప్టర్ షాట్ కొట్టడానికి తాను 10 నెలల పాటు కఠోర శిక్షణ తీసుకున్నానని ‘ఎంఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’ చిత్రం హీరో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ అన్నాడు. ఈ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మాట్లాడుతూ, పది నెలల పాటు శిక్షణ తీసుకున్న తర్వాతే హెలికాప్టర్ షాట్ లో పరిపూర్ణత సాధించగలిగానని చెప్పాడు. కాగా, ధోని హెలికాప్టర్ షాట్ తో ప్రాచుర్యం పొందడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది క్రీడాభిమానులను సంపాదించుకున్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

More Telugu News