Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సంగారెడ్డిలో స్కూలు పిల్లల సమక్షంలో పుట్టిన రోజు జరుపుకున్న సినీ నటి యామినీ భాస్కర్

తెలుగులో 'కీచక', 'టైటానిక్' సినిమాలతో పాటు తమిళంలో 'మున్నోడి' సినిమాలో హీరోయిన్ గా నటించిన వర్థమాన నటి యామినీ భాస్కర్ సంగారెడ్డిలోని ఓ గర్ల్స్ స్కూల్ లో సందడి చేసింది. పుట్టిన రోజును పిల్లల సమక్షంలో నిర్వహించుకోవాలని భావించిన యామినీ భాస్కర్ ఆ స్కూలుకు వచ్చింది. ఈ సందర్భంగా ఆ స్కూలు విద్యార్థులు పరిశుభ్రమైన నీరు తాగేందుకు వాటర్ ప్యూరిఫైర్ ను అందజేసింది. పిల్లల మధ్య పుట్టిన రోజు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని తెలిపింది. ప్రస్తుతానికి ఓ స్టార్ హీరో సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నానని చెప్పింది. దాని వివరాలు త్వరలోనే తెలియజేస్తానని ఆమె చెప్పింది.

More Telugu News