Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రత్యేక జిల్లాల కోసం వికారాబాద్‌, సిరిసిల్లలో కొనసాగుతున్న బంద్

ప్రత్యేక జిల్లాల కోసం తెలంగాణలో బంద్‌లు కొనసాగుతున్నాయి. 19 మండలాలతో కూడిన వికారాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో బంద్ చేపట్టగా, కరీంనగర్ జిల్లా సిరిసిల్లను ప్రత్యేక జిల్లా చేయాలనే డిమాండ్‌తో జేఏసీ బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వస్త్రపరిశ్రమలు, 36 వేల మరమగ్గాల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. బస్సులు బయటకు రాకుండా సిరిసిల్ల డిపో ఎదుట ఆందోళనకారులు బైఠాయించారు. బస్సు అద్దాలను ధ్వంసం చేసి రోడ్లపై టైర్లు తగలబెట్టారు. అలాగే ఓ పెట్రోలు బంక్ అద్దాలను ధ్వంసం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భారీగా మోహరించారు.

More Telugu News