చైనా వ్యవహారంపై ప్రధాని మౌనానికి అర్థం?: ములాయం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చైనా వ్యవహారంపై ప్రధాని మౌనానికి అర్థం?: ములాయం

భారత భూభాగంలో చైనా చొరబాటుపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ విమర్శించారు. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి స్పందించిన తీరును ఆయన ప్రశ్నించారు. ఈరోజు లోక్ సభ సమావేశాల్లో మాట్లాడిన ములాయం.. లడక్ ప్రాంతంలో చైనా సైన్యం చొరబాటుకు పాల్పడడంపై మండిపడ్డారు.

మన ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుంటే ప్రభుత్వం మాత్రం ప్రాంతాన్ని అప్పగించాలని పొరుగుదేశాన్ని వేడుకుంటోందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించడంలేదన్నారు. చైనా చొరబాటు అంశంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎందుకు సీరియస్ గా వ్యవహరించడం లేదో తనకు అర్ధం కావడంలేదని ప్రభుత్వంపై ఎస్పీ అధినేత దాడికి దిగారు. ఈ అంశంలో చైనా వివరణను ప్రభుత్వం ఎందుకు కోరడం లేదని సూటిగా ప్రశ్నించారు.

More Telugu News