Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యూరీ దాడి వెనుక స్వీయ లోపాలు... విచారణకు ఆదేశించిన కేంద్రం

యూరీలోని ఆర్మీ బేస్ క్యాంపుపై భీకర ఉగ్రదాడి వెనుక భద్రతాపరమైన స్వీయ లోపాలు కూడా ఉండవచ్చని అనుమానించిన కేంద్రం ఈ దిశగా విచారణకు ఆదేశించింది. కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ కొద్దిసేపటి క్రితం ఈ విషయాన్ని వెల్లడించారు. "నా సైన్యాన్ని దగ్గరగా చూసిన తరవాత, అసలు యూరీలో ఏం జరిగిందన్నది తెలుసుకోవాలని అనిపించింది. ఈ విషయాన్ని విచారించాలి. ముష్కరమూక చొరబడటానికి కారణాలేంటని అన్వేషించాలి. ఆర్మీ వైపు నుంచి నిత్యమూ అలర్ట్ గా ఉండాలి. అందునా కాశ్మీర్ లోయలో మరింత అప్రమత్తత అవసరం. పరిస్థితులను ఆగ్రహం, భావోద్వేగాలతో చూడరాదు. సరైన ప్రణాళికతోనే శత్రువులపై చర్యలు తీసుకోవాలి. చొరబాటు వెనుక స్వీయ లోపాలున్నాయా? అన్నది తెలుసుకోవాల్సివుంది" అని అన్నారు. ఈ ఉదయం ప్రధాని, హోం మంత్రి, ఆర్థిక మంత్రులతో ఎలాంటి ప్రతిదాడులకు దిగాలన్న విషయం కూడా చర్చించామని తెలిపారు. దీనికి కారణమైన వారిని శిక్షించకుండా మాత్రం వదిలేది లేదని స్పష్టం చేశారు.

More Telugu News