కడప జిల్లాలో దారుణం... పెద్ద భార్య కొడుకును హత్యచేసిన రెండో భార్య!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కడప జిల్లాలో దారుణం... పెద్ద భార్య కొడుకును హత్యచేసిన రెండో భార్య!

కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో పెద్ద భార్య కుమారుడిని రెండో భార్య హత్య చేసింది. పట్టణంలోని కోనేటి కాల్వ వీధిలో జరిగిన ఈ ఘోరానికి సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, సురేష్ కు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య కుమారుడు సుజన్. సురేష్ కు రెండో భార్య ప్రేమ. గత కొంతకాలంగా వీరి మధ్య ఆస్తి గొడవలు, కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రేమ, సుజన్ ను కత్తితో పలుమార్లు పొడిచి చంపి, ఆపై తానూ ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటనలో ప్రేమ తీవ్రంగా గాయపడగా, సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.

More Telugu News