రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షానికి 'కాగ్నా' ఉగ్రరూపం, కొట్టుకుపోయిన బ్రిడ్జి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షానికి 'కాగ్నా' ఉగ్రరూపం, కొట్టుకుపోయిన బ్రిడ్జి

రంగారెడ్డి జిల్లాలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కాగ్నా నది ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రవాహ ఉద్ధృతికి తాండూరు వద్ద వంతెన కొట్టుకుపోగా, తాండూరు - మహబూబ్ నగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వికారాబాద్, తాండూరు పరిసర ప్రాంతాల్లో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఈ సంవత్సరం ఇదే అత్యధిక వర్షమని అధికారులు తెలిపారు. హైదరాబాద్ తో పాటు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గడచిన మూడు రోజుల నుంచి ఆగి ఆగి వర్షాలు పడుతున్నాయి.

More Telugu News