నా కాళ్లను చూసి 15 ప్రొడక్టులు కొంటున్నారు: ప్రియాంకా చోప్రా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా కాళ్లను చూసి 15 ప్రొడక్టులు కొంటున్నారు: ప్రియాంకా చోప్రా

తన కాళ్లు ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలకు చెందిన 15 రకాల ప్రొడక్టుల అమ్మకాలకు సహకరిస్తున్నాయని బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా చెప్పుకొచ్చింది. 'డబ్ల్యూ' మేగజైన్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ మిస్ వరల్డ్ బ్యూటీ, నేడు ఎందరో అమ్మాయిలు, యువతులు తాను ప్రచారం చేస్తున్న వివిధ బ్రాండ్లను కొనుగోలు చేస్తున్నారని గుర్తు చేసింది. తన చిన్నప్పుడు మూడేళ్ల పాటు అమెరికాలో చదువుకున్న సమయంలో స్కూల్లో జాతి వివక్షకు కూడా గురయ్యానని వెల్లడించింది. "నేను టీనేజ్ లో ఉన్నప్పుడు మగరాయుడిలా తిరిగేదాన్ని. నా కాళ్లేమీ అప్పట్లో అందంగా ఉండేవి కాదు. ఆ తరువాత శరీరంపై శ్రద్ధ పెట్టడం ప్రారంభించాను. నేను చేసినట్టు ఎవరైనా చేయవచ్చు. ఇప్పుడు నా కాళ్లను చూసి 12 నుంచి 15 ప్రొడక్టుల వరకూ కొనుగోలు చేస్తున్నారు" అని ప్రియాంక అంది. నేటి తరం అమ్మాయిలు శరీర సంరక్షణపై మరింత దృష్టిని సారిస్తున్నారని చెప్పింది. నిన్నటి వరకూ బాలీవుడ్ కు పరిమితమై కేవలం హిందీ సినిమాలే చేస్తూ వచ్చిన ప్రియాంక, ఇప్పుడు క్వాంటికో టీవీ సిరీస్, ఇంగ్లీష్ మూవీ 'బేవాచ్'తో హాలీవుడ్ ప్రేక్షకులకూ దగ్గరైన సంగతి తెలిసిందే.

More Telugu News