లియాండర్ పేస్ సాక్షిగా ప్రియురాలికి ప్రపోజ్ చేసిన సాకేత్ మైనేని... సిగ్గులొలుకుతూ ఓకే చెప్పిన శ్రీలక్ష్మి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లియాండర్ పేస్ సాక్షిగా ప్రియురాలికి ప్రపోజ్ చేసిన సాకేత్ మైనేని... సిగ్గులొలుకుతూ ఓకే చెప్పిన శ్రీలక్ష్మి

భారత టెన్నిస్ ప్రపంచంలో నెంబర్ వన్ ఆటగాడిగా ఉన్న సాకేత్ మైనేని, తన ప్రియురాలి మనసు గెలుచుకున్నాడు. స్పెయిన్ తో డేవిస్ కప్ ఆటలకు బయలుదేరే ముందు ఢిల్లీలో విందు ఏర్పాటు చేయగా, సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్ తదితరులు చూస్తున్న వేళ, మోకాళ్లపై కూర్చుని తన ప్రియురాలు శ్రీలక్ష్మికి గులాబీ పువ్వును ఇస్తూ, తనను పెళ్లి చేసుకోమని ప్రతిపాదించాడు. నవ్వుతూ దాన్ని అందుకున్న శ్రీలక్ష్మి సిగ్గులొలుకుతూ సాకేత్ తో వివాహానికి అంగీకరించింది. దీంతో అక్కడున్న ప్రతి ఒక్కరూ చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేయగా, కాబోయే జంట కేక్ ను కట్ చేసింది. ఇక తన సమక్షంలో ఇదే తొలి పెళ్లి ప్రపోజల్ అని లియాండర్ పేస్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు.

More Telugu News