ట్రంప్‌ను వెనక్కి నెట్టిన హిల్లరీ.. 5 శాతం ఓట్లతో ముందంజ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ట్రంప్‌ను వెనక్కి నెట్టిన హిల్లరీ.. 5 శాతం ఓట్లతో ముందంజ

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల తరపున అధ్యక్ష పదవికి పోటీపడుతున్న హిల్లరీ క్లింటన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నట్టు తాజా సర్వే ఒకటి వెల్లడించింది. రిపబ్లికన్ నేత అయిన ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి అయిన హిల్లరీల మధ్య హోరాహోరీగా పోరు సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా వాషింగ్టన్ పోస్ట్-ఏబీసీ న్యూస్ నిర్వహించిన సర్వేలో హిల్లరీ క్లింటన్ తన ప్రత్యర్థి కంటే 5 శాతం ఓట్లతో ముందంజలో ఉన్నట్టు తేలింది. హిల్లరీకి 46శాతం, ట్రంప్‌కు 41 శాతం మంది మద్దతు ఇచ్చినట్టు సర్వే పేర్కొంది. కాగా అమెరికా అధ్యక్ష భవనానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ చారిత్రక భవనాన్ని ఇటీవల వేలంలో దక్కించుకున్న ట్రంప్ దానిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన హోటల్‌ను ఏర్పాటు చేశారు.

More Telugu News