‘ఆప్’ ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్ నన్ను 5 సార్లు లైంగికంగా వేధించాడు.. కోర్టులో చెప్పిన బాధిత మహిళ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘ఆప్’ ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్ నన్ను 5 సార్లు లైంగికంగా వేధించాడు.. కోర్టులో చెప్పిన బాధిత మహిళ

ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన మహిళ వాంగ్మూలాన్ని ఢిల్లీలోని కోర్టు నిన్న రికార్డు చేసింది. ఎమ్మెల్యేతో జరిపిన సంభాషణలకు సంబంధించిన సీడీ, పెన్‌డ్రైవ్‌లను కోర్టుకు సమర్పించింది. వేధింపుల కేసు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. కోర్టు ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో బాధిత మహిళ తన ఆవేదనను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. గత ఏడాదిన్నర కాలంలో ఎమ్మెల్యే తనను ఐదుసార్లు లైంగికంగా వేధించినట్టు కోర్టుకు తెలిపింది. భర్తతో విభేదాల కారణంగా షహీన్‌బాగ్‌లోని ఓ అద్దె ఇంట్లో గత నాలుగు నెలలుగా ఉంటున్నట్టు స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. తన భర్త సమక్షంలోనే ఎమ్మెల్యే తనను పలుమార్లు కలిశారని తెలిపింది. ఈ విషయాన్ని భర్త దృష్టికి తీసుకెళ్తే.. ఎమ్మెల్యే చెప్పినట్టు చేయమన్నారని తెలిపింది. అలా చేయడం వల్ల తన బిజినెస్‌కు మేలు జరుగుతుందని భర్త తనతో చెప్పారని పేర్కొంది. కొన్ని రోజుల క్రితం తనను కలిసిన ఎమ్మెల్యే లైగింకంగా వేధించారని వివరించింది. శుక్రవారం నుంచి ఎమ్మెల్యే తనను బెదిరిస్తున్నారని, తనకు పోలీసు రక్షణ కల్పించాలని కోరింది.

More Telugu News