నాపై భారతీయులు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు: మిస్ వరల్డ్ జపాన్ ప్రియాంక

07-09-2016 Wed 08:45 | International
తాను భారతీయురాలిని కాకపోయినా భారతీయులు తనపై చూపించిన ప్రేమ మర్చిపోలేనిదని 'మిస్ వరల్డ్ జపాన్' ప్రియాంక యోషికవా అన్నారు. భారత్ మూలాలున్న ప్రియాంక(22) మిస్ వరల్డ్ జపాన్ కిరీటాన్ని గెలుచుకున్న అనంతరం మాట్లాడుతూ తనకు అండగా నిలిచిన భారతీయులకు ధన్యవాదాలు తెలిపారు. మిస్ జపాన్‌గా ఇతర దేశానికి చెందిన, ఆ మూలాలున్న వారు ఎప్పుడూ మిస్ జపాన్ పోటీల్లో పాల్గొనకపోవడంతో ప్రియాంకపై నిరసనలు వెల్లువెత్తాయి. కొందరు జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో అయితే ఆమెపైనే చర్చ జరిగింది. వాటన్నింటినీ తోసిరాజని ప్రియాంక మిస్ జపాన్‌గా ఎంపికైంది. డిసెంబరులో వాషింగ్టన్‌లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలో ఆమె పాల్గొననుంది. ప్రియాంక తండ్రి కోల్‌కతాకు చెందిన వారు. విద్యార్థిగా జపాన్ వెళ్లినప్పుడు ఆ దేశస్థురాలని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. మిస్ జపాన్‌గా ఎంపికైన అనంతరం ప్రియాంక ఉద్విగ్నంగా మాట్లాడారు. ‘‘నేను భారతీయురాలిని కాకున్నా విజయం సాధించాలంటూ భారత్ నుంచి మెసేజ్‌లు వెల్లువెత్తాయి’’ అని పేర్కొన్నారు. మిస్ జపాన్‌గా ఎంపికైన ప్రియాంకకు ఏనుగు శిక్షకురాలి లైసెన్స్ కూడా ఉండడం గమనార్హం. తాను ఎన్నోమార్లు జాతి వివక్షను ఎదుర్కొన్నానని చెప్పిన ప్రియాంక దీనిపై పోరాడతానని పేర్కొన్నారు. నల్ల జాతి మూలాలున్న అరియానా మియామొటో మిస్ యూనివర్స్ జపాన్‌గా కిరీటం అందుకోవడం తనకు స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. అరియానాపైనా సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తాయి. ఆమె ప్రాతినిధ్యాన్ని జీర్ణించుకోలేని కొందరు జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. తాను తరచూ భారత్‌ను సందర్శిస్తుంటానని ప్రియాంక తెలిపారు. కోల్‌కతాలోని అనాథలకు సాయం అందించాలన్నదే తన అభిమతమని పేర్కొన్నారు. ‘‘అనాథలకు చేయూత అందించేందుకు కోల్‌కతాలో ఓ ఇల్లు నిర్మించాలనుకుంటున్నా. నా తండ్రి ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు’’ అంటూ సామాజిక సేవపై స్పందించిన ఆమె సమాధానం విన్న న్యాయమూర్తులు ప్రియాంకకు మిస్ జపాన్ కిరీటం తొడిగారు. కాగా ప్రియాంక ముత్తాత ఒకరు మహాత్మాగాంధీని ఆహ్వానించి కోల్‌కతాలోని తన ఇంట్లో రెండు వారాలపాటు ఆతిథ్యం ఇవ్వడం విశేషం.

More Telugu News

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11
..more