ఒక్కోసారి ఈ గాసిప్స్ ను భరించలేకపోతున్నాను!: హీరోయిన్ సమంత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒక్కోసారి ఈ గాసిప్స్ ను భరించలేకపోతున్నాను!: హీరోయిన్ సమంత

తనపై వస్తున్న గాసిప్స్ పై స్పందిస్తే ఒక బాధ, స్పందించకపోతే మరో బాధ అంటూ దక్షిణాది ముద్దుగుమ్మ సమంత తల పట్టుకుంటోంది. ‘నా పై వచ్చిన ప్రతి గాసిప్ కు నేను స్పందించలేను. ఇలాంటి వాటిలో కొన్నింటిని అసలు పట్టించుకోను. అయితే, నేను పట్టించుకోవటం లేదని చెప్పి, ఇంకొన్ని కొత్త గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. అందుకే, స్పందించాల్సి వస్తోంది. అయితే, మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఇటువంటి గాసిప్స్ మామూలేనని అనుకుని ఊరుకోవాల్సి వస్తోంది. ఎంతగా మనసుకు సర్ది చెప్పుకున్నా, ఈ గాసిప్స్ ను ఒక్కోసారి భరించలేకపోతున్నాను’ అని సమంత తన ఆవేదన వ్యక్తం చేసింది.

More Telugu News