: దావూద్ కదలికలపై నిఘా పెట్టనున్న ఐదు ప్రత్యేక బృందాలు


అండర్ వరల్డ్ డాన్, ముంబయి దాడుల సూత్రధారి దావూద్ ఇబ్రహీంను పట్టుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకెళ్లనుంది. పాకిస్థాన్ లోని కరాచీలో తలదాచుకుంటున్న దావూద్ ను పట్టుకునేందుకు గాను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఇన్ కంట్యాక్స్ డిపార్ట్ మెంట్, రీసెర్చ్ అండ్ అనాలసిసి వింగ్ (రా), సీబీఐ, ఇంటర్ పోల్ ల నుంచి మొత్తం 50 మందిని ఎంపిక చేసింది. ప్రపంచ వ్యాప్తంగా దావూద్, ఆయన గ్యాంగ్ కదలికలపై ఈ బృందాలు నిఘా పెట్టనున్నాయి. కాగా, కరాచీలో నివసిస్తున్న దావూద్ ఆరోగ్యపరిస్థితి రోజురోజుకీ క్షీణిస్తున్నట్లు నిఘా వర్గాలకు విశ్వసనీయ సమాచారం ఉంది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం, దావూద్ పాక్ లో తలదాచుకుంటున్నప్పటికీ తనకు ప్రమాదముందని భావిస్తున్నాడు. షేక్ ఇస్మాయిల్ అనే వ్యాపారస్తుడి పేరుపై దావూద్ అక్కడ నివసిస్తున్నాడు. భద్రతా కారణాల దృష్ట్యా దావూద్ తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదట. దావూద్ భార్య మెహజబీన్ షేక్ ఆయనకు వచ్చే ఫోన్లు రిసీవ్ చేసుకుంటోందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి వ్యాపారాలను కూడా ఆమే నడిపిస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం. అండర్ వరల్డ్ డాన్ ను పట్టుకునే నేపథ్యంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలు నడుపుతున్న 11 మంది దావూద్ సన్నిహితులను నిఘా వర్గాలు గుర్తించాయి. ఎయిర్ లైన్స్, పవర్, ఆయిల్, కస్ స్ట్రక్షన్, గార్మెంట్ రంగాల్లో ఉన్న దావూద్ కంపెనీలు ఏడింటిపై కూడా నిఘా సంస్థలు దృష్టి పెట్టాయి.

  • Loading...

More Telugu News