Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'అమ్మా! నాన్న ఫోటోను ఫోన్లో పెట్టుకో'... అని చెప్పిన ఆద్య కోరికను వెంటనే తీర్చేసిన రేణూ దేశాయ్

పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేళ, ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఓ పోస్టు వైరల్ కాగా, పవన్ అభిమానులంతా హ్యాపీగా ఫీలవుతున్నారు. తండ్రి పుట్టిన రోజున, తన కుమార్తె ఆద్య... "అమ్మా, ఇవాళ నాన్న పుట్టినరోజు. కాబట్టి నువ్వు తప్పనిసరిగా నాన్న పిక్చర్ నీ ఫోన్ లో పెట్టుకోవాల్సిందే" అన్నదట. ఆ వెంటనే కుమార్తె కోరికను తీర్చాలని భావించిన రేణు, పవన్ ఫోటోను ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టిందట. ఈ విషయాన్ని రేణు ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న పవన్ అభిమానులు, 'థ్యాంక్యూ వదినమ్మా, క్యూట్ డాటర్, నైస్, సూపర్' అంటూ కామెంట్లు వదులుతున్నారు.

More Telugu News