: నేను దర్శకత్వం వహిస్తే కనుక ఆ సినిమాకి సినిమాటోగ్రాఫర్ అతనే!: నిత్యా మీనన్
తనకు సినిమాటోగ్రాఫర్ తిరు మైండ్ సెట్ బాగా నచ్చుతుందని నిత్యామీనన్ చెప్పింది. 'జనతా గ్యారేజ్' ప్రమోషన్ లో మాట్లాడుతూ, సినిమాటోగ్రాఫర్ తిరు తీసిన సైలెంట్ సన్నివేశాలు కూడా మాట్లాడతాయని చెప్పింది. తనకు ప్రతి సినిమాలో నటుల కంటే సినిమాటోగ్రాఫర్ తోనే మైండ్ సెట్ సరిపోతుందని చెప్పింది. తనకు తిరు సినిమాటోగ్రఫీ నచ్చుతుందని చెప్పింది. దానికి కారణం తనకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టముండడమేనని తెలిపింది. ఒకవేళ తాను దర్శకత్వం వహిస్తే, దానికి సినిమాటోగ్రాఫర్ తిరుతో కలిసి పనిచేస్తానని చెప్పింది. పీసీ శ్రీరామ్ వంటి వారితో పని చేసిన అనుభవం తనకు ఉందని, అయితే ఎందుకో తన మైండ్ సెట్ కు, తిరు మైండ్ సెట్ కు మధ్య మంచి సంబంధం ఉన్నట్టు అనిపిస్తుందని, ఆయన మంచి సన్నివేశాలను తీస్తారని నిత్యామీనన్ మెచ్చుకుంది. దీంతో భవిష్యత్ లో దర్శకురాలిగా మారుతానని నిత్యామీనన్ చెప్పకనే చెప్పింది.