రాజకీయాల్లోకి నయనతార.. అరంగేట్రానికి రంగం సిద్ధం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజకీయాల్లోకి నయనతార.. అరంగేట్రానికి రంగం సిద్ధం!

అందం, అభినయంతో ఆకట్టుకుంటూ టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న మలయాళ ముద్దుగుమ్మ నయనతార తమిళ రాజకీయ రంగం ప్రవేశం చేయనుందా?.. అంటే అవుననే అంటున్నారు ఆమె సన్నిహితులు. తన రాజకీయ అరంగేట్రానికి సంబంధించి నయన్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకున్నట్టు తెలుస్తోంది. ఆమె అధికార అన్నా డీఎంకే పార్టీలో చేరనున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సాధారణంగా తాను నటించే చిత్రాల ప్రమోషన్‌కు నయనతార హాజరుకారు. ఈ విషయాన్ని దర్శకనిర్మాతలకు ముందే చెప్పేస్తారు. ఈ విషయంలో ఆమెపై చాలా విమర్శలు ఉన్నాయి. నటించడం వరకే తనపని అని, మిగతాది దర్శకనిర్మాతలు చూసుకోవాల్సిందేనని ఆమె తెగేసి చెబుతారు. అలాంటి నయన్ మనస్తత్వంలో మార్పు కనిపిస్తోంది. ఇటీవల అధికార పార్టీ నిర్వహించిన స్పోర్ట్స్ ఫౌండేషన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని చర్చకు తెరలేపారు. హీరోయినలా కాకుండా సాధారణ మహిళలా నయన్ ఆ కార్యక్రమానికి హాజరుకావడంతో విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. సరిగ్గా ఇదే ఆమె రాజకీయరంగ ప్రవేశంపై చర్చలకు తెరలేపింది. ఆమె అధికార పార్టీలో చేరడం ఖాయమని సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఈ విషయంలో నయన్ ఇప్పటి వరకు స్పందించలేదు. రాజకీయాల్లో చేరి శాసించిన సినీ ప్రముఖులు ఎందరో ఉన్నారు. తెలుగు, తమిళ, కన్నడ రాజకీయాల్లో ఇది మరింత ఎక్కువ. ఇప్పుడు ఇదే కోవలోకి చేరుతున్న ఈ మలయాళీ చిన్నది రాజకీయాల్లో ఏమేరకు రాణిస్తుందో వేచి చూడాల్సిందే. ఇటీవల తమిళనాట జరిగిన ఎన్నికల సందర్భంగా నటి నమిత అన్నాడీఎంకేలో చేరిన సంగతి తెలిసిందే.

More Telugu News