మా ఫ్యామిలీపై సి.కల్యాణ్ నోరు పారేసుకోవడం సరికాదు: నట్టి కుమార్ పిల్లలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా ఫ్యామిలీపై సి.కల్యాణ్ నోరు పారేసుకోవడం సరికాదు: నట్టి కుమార్ పిల్లలు

గ్యాంగ్ స్టర్ నయీమ్ తో సంబంధాలు లేవని నిరూపించుకోవాల్సిందిపోయి తమ ఫ్యామిలీపై నిర్మాత సి.కల్యాణ్ నోరు పారేసుకోవడం సరికాదని నట్టి కుమార్ కూతురు కరుణ, కొడుకు క్రాంతి అన్నారు. నయీమ్ తో కల్యాణ్ కు సంబంధాలున్నాయి కాబట్టే తన తండ్రి ఆరోపణలు చేశారని, తన తండ్రి ఆసుపత్రి నుంచి రాగానే ఆ ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపిస్తామని అన్నారు. తెలుగు చిత్ర సీమలో ప్రముఖ నిర్మాతలుగా కొనసాగుతున్న సి.కల్యాణ్, అశోక్ కుమార్, బండ్ల గణేశ్, సచిన్ జోషిలకు నయీమ్ తో సంబంధాలున్నాయంటూ నట్టి కుమార్ ఇటీవల చేసిన ఆరోపణలు సంచలనం రేపిన విషయం తెలిసిందే.

More Telugu News