క్రికెటర్ వకార్ యూనిస్ అంటే ఇష్టం: జమైకా చిరుత బోల్ట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

క్రికెటర్ వకార్ యూనిస్ అంటే ఇష్టం: జమైకా చిరుత బోల్ట్

రియో ఒలింపిక్స్ తో ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించిన జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ కు తన చిన్నతనంలో పరిగెత్తడం అంటే అసలు ఇష్టపడేవాడు కాదట. పైగా, క్రికెట్, ఫుట్ బాల్ క్రీడలపై చిన్నప్పటి నుంచి అమితమైన ఇష్టమట. రన్నింగ్ లో తాను విజయాలు సాధించడం వల్లే ఇన్నాళ్లూ ఈ పోటీల్లో కొనసాగానని చెప్పాడు. ఈ విషయాలను ఒక ఇంటర్వ్యూలో బోల్ట్ పేర్కొన్నాడు. పాకిస్థాన్ క్రికెటర్ వకార్ యూనిస్ అంటే తనకు ఇష్టమని చెప్పాడు. కాగా, లండన్, బీజింగ్, రియో ఒలింపిక్స్ లలో 100, 200, 4x100 మీటర్ల లో రన్నింగ్ పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించి ట్రిపుల్ హ్యాట్రిక్ ను బోల్ట్ తన పేరిట నమోదు చేసుకున్నాడు.

More Telugu News