: తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన మోదీకి ధన్యవాదాలు చెప్పిన కేజ్రీవాల్


ప్రధాని నరేంద్రమోదీ తన రాజకీయ శత్రువుల విషయంలో కూడా సంస్కారాన్ని ప్రదర్శిస్తూ వుంటారు. పార్టీలతో సంబంధం లేకుండా ఆయా నాయకుల బర్త్ డే లకు సోషల్ మీడియా ద్వారా విషెస్ చెబుతుంటారు. అలాగే ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి కూడా విషెస్ చెప్పారు. తాజాగా 48వ పడిలో ప్రవేశించిన కేజ్రీవాల్ కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కేజ్రీవాల్ ఆరోగ్యం కోసం దేవుణ్ణి ప్రార్థించానని ట్వీట్ చేశారు. కేజ్రీవాల్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. దీనిపై స్పందించిన కేజ్రీవాల్ మోదీకి ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News