Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోలీసుల అదుపులో నయీం అత్త, బావమరిది

నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని నయీం అత్త సుల్తానా బేగం, బావమరిది షాజిద్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరున్నర లక్షల నగదు, విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, హైదరాబాద్ అల్కాపురి కాలనీలోని నయీం ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించి భారీగా నగదు, నగలు, పలు కీలక పత్రాలు, ఆడీ కారు స్వాధీనం చేసుకున్నారు. భువనగిరి, నల్గొండలోని నయీం ఇళ్లతో సహా పగిడిపల్లి ఎంపీీపీ వెంకటేష్ ఇంట్లో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు.

More Telugu News