నయీం ఇంట్లో తనిఖీలు...భారీ మొత్తంలో డబ్బు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నయీం ఇంట్లో తనిఖీలు...భారీ మొత్తంలో డబ్బు!

గ్రేహౌండ్స్ పోలీసుల ఎన్ కౌంటర్ లో హతమైన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయీం ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. భువనగిరిలోని నయీం ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో ఇద్దరు డీఎస్పీలు, నలుగురు ఏఎస్పీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ మొత్తంలో డబ్బు లభ్యమైనట్టు సమాచారం. అలాగే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండల పరిధిలో నయీం బంధువుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించి కోట్లాది రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. రెండు కౌంటింగ్ మిషన్లతో డబ్బును లెక్కిస్తున్నారు. నయీం అనుచరులు ఇద్దరిని, రెండు వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. కాగా, పోలీసుల అదుపులో నయీం భార్య, కూతురు ఉన్నారు.

More Telugu News