కాంగ్రెస్ నిర్వాకం వల్లే ఇన్ని గొడవలు!: వెంకయ్యనాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. ప్రస్తుతం కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్న ఆయన, మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు హోదా అంశాన్ని విభజన చట్టంలో చేర్చలేదని, అందువల్లే ఇప్పుడిన్ని గొడవలు జరుగుతున్నాయని అన్నారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని వంటిదేమీ కాదని అభిప్రాయపడ్డ ఆయన, హోదా అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల తరువాత హోదా విషయం సందిగ్ధంలో పడిందని అన్నారు. ఏపీతో పాటు చాలా రాష్ట్రాలు ప్రత్యేక హోదాను అడుగుతున్నాయని, ఒక రాష్ట్రానికి మాత్రమే ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని వివరించారు.