Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నమ్మించి సర్వం దోచుకున్నాడంటూ, బాలీవుడ్ దర్శకుడు అర్హాన్ అక్తర్ పై ముంబై మోడల్ రేప్ కేసు

మోడల్ గా పనిచేస్తూ నటిగా రాణించాలన్న తన కోరికను అలుసుగా తీసుకుని నమ్మించి మోసం చేయడంతో పాటు, తనపై అత్యాచారం చేశారని ఆరోపిస్తూ, బాలీవుడ్ దర్శకుడు అర్హాన్ అక్తర్, మరో ఇద్దరు ఫైనాన్షియర్లపై ఓ మోడల్ కేసు పెట్టింది. బాధితురాలి కథనం ప్రకారం, ఇమ్రాన్ ఖాన్ హీరోగా తాను తీయబోయే సినిమాలో హీరోయిన్ చాన్స్ ఇస్తానని అర్హాన్ ఆమెకు హామీ ఇచ్చాడు. అయితే, తన కోరిక తీరిస్తేనే ఈ చాన్స్ లభిస్తుందని ఆయన చెప్పడంతో, సినిమా చాన్స్ కోసం ఆమె అంగీకరించింది. ఆపై చిత్రానికి డబ్బు పెట్టేవాళ్లంటూ, ఇద్దరు ఫైనాన్షియర్ల వద్దకు ఆమెను వెళ్లమని చెప్పాడు. లక్నో, ఢిల్లీకి చెందిన ఫైనాన్షియర్ల వద్దకు మోడల్ వెళ్లింది. ఆపై సినిమా అవకాశం చేజిక్కలేదు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

More Telugu News