ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు సర్వం సిద్ధం.. హైదరాబాద్లో భారీ బందోబస్తు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనకు సర్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ఎల్బీ స్టేడియం వరకు ఐదు వేల మంది పోలీసులతో బందోబస్తు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నారు. బేగంపేట, ఎల్బీస్టేడియం ప్రాంతాల్లో రెండు కిలో మీటర్ల వరకు నిషేధాజ్ఞలు విధించారు. ర్యాపిడ్ యాక్షన్, ఫోర్స్, ఆర్ముడ్ఫోర్స్, టీఎస్ఎస్పీతో బందోబస్తును పటిష్టం చేశారు. సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేశారు. మోదీ వచ్చే మార్గంలో 17 మౌంటెడ్ కెమెరాలతోనూ నిఘా ఏర్పాటు చేశారు.