మోదీ టూర్ ఎఫెక్ట్!... పోలీసుల వలయంలో భాగ్యనగరి, గజ్వేల్!
ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ తొలిసారి హైదరాబాదుకు రానున్నారు. రేపు హైదరాబాదు రానున్న మోదీ... తెలంగాణ సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్, కరీంనగర్ జిల్లా రామగుండంలోనూ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీ నుంచి హైదరాబాదు వచ్చేసిన ప్రధాని భద్రతా సిబ్బంది 'స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్' (ఎస్పీజీ) మోదీ పర్యటించే ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎస్పీజీ సూచనలతో తెలంగాణ పోలీసులు హైదరాబాదు, గజ్వేల్ లలో మూడంచెల భద్రతలను అమల్లోకి తీసుకొచ్చారు. వెరసి హైదరాబాదు, గజ్వేల్ లో 3 వేల మందికి పైగా పోలీసులు మోహరించారు.