అడకత్తెరలో పోకచెక్కలా కురియన్ పరిస్థితి... తెలివిగా తప్పించుకున్న వైనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అడకత్తెరలో పోకచెక్కలా కురియన్ పరిస్థితి... తెలివిగా తప్పించుకున్న వైనం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ ప్రవేశపెట్టిన ప్రత్యేక బిల్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ పీకలమీదకు తెచ్చింది. అయితే అందులోంచి ఆయన చాలా తెలివిగా బయటపడ్డారు. స్వతహాగా ఆయన కాంగ్రెస్ పార్టీ నేత. కేవీపీ బిల్లు మనీ బిల్లు అని చెబితే సొంత పార్టీ నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగని కాదంటే కేంద్రానికి ఎదురు తిరగడమే అవుతుంది. కావాలని కష్టాలను కొనితెచ్చుకోవడం ఎందుకని భావించిన కురియన్ సాహసాలను పక్కనపెట్టి బిల్లు చిక్కుముడి నుంచి తెలివిగా బయటపడ్డారు. ఈ తలనొప్పి తనకెందుకు అనుకున్న కురియన్ కేవీపీ బిల్లును లోక్‌సభ స్పీకర్‌కు నివేదించి చేతులు దులుపుకున్నారు. కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లును లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మనీ బిల్లుగా తేల్చితే బిల్లు వీగిపోయి చెత్తబుట్టలోకి వెళ్తుంది. అవునంటే తిరిగి రాజ్యసభకు ఓటింగ్‌కు వెళ్తుంది. దీంతో స్పీకర్ నిర్ణయం కోసం ఏపీ ప్రజలు ఆశగా చూస్తున్నారు.

More Telugu News