హైదరాబాద్లో విషాదం.. చెరువులో దూకి ఇద్దరు యువతుల ఆత్మహత్య
హైదరాబాద్లో విషాదం చోటు చేసుకుంది. నేరేడ్మెట్ ఆర్కేపురంలోని చెరువులో దూకి ఈరోజు ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతి చెందిన యువతుల గురించి ఆరా తీశారు. ఘటనా స్థలిలో పోలీసులకి ఆత్మహత్య లేఖలు లభ్యమయ్యాయి. మృతులను మౌనిక నాగార్జున, సౌమ్య రాజేశ్వరిగా వారు గుర్తించారు.
తనను కామేశ్ అనే వ్యక్తి వేధింపులకు గురిచేస్తున్నాడని, తన చావుకి ఆయనే కారణమని మౌనిక లేఖలో పేర్కొంది. కొందరు తనను మోసం చేస్తున్నారని, తనను ప్రపంచంలో ఎవ్వరూ పట్టించుకోనందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సౌమ్య పేర్కొంది. ఆత్మహత్య లేఖల ఆధారంగా పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు.