Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీడీపీ ఏపీ చీఫ్ తో దేవినేని నెహ్రూ భేటీ!... కొడుకుతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న కాంగ్రెస్ సీనియర్!

రాష్ట్రాన్ని నిట్టనిలువునా విభజించిన కాంగ్రెస్ కు ఏపీలో మరో భారీ షాక్ తగలనుంది. ఇప్పటికే గడచిన ఎన్నికల్లో ఆ పార్టీకి ఏపీలో సింగిల్ సీటు కూడా దక్కలేదు. తాజాగా కృష్ణా జిల్లాలో ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. తనతో పాటు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న తన కుమారుడు దేవినేని అవినాశ్ ను కూడా వెంటబెట్టుకుని టీడీపీలో చేరిపోతున్నారు. ఈ మేరకు నిన్న టీడీపీ ఏపీ చీఫ్ కిమిడి కళా వెంకట్రావుతో దేవినేని ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కృష్ణా పుష్కరాలు ముగిసిన వెంటనే దేవినేని టీడీపీ ఎంట్రీకి వారిద్దరూ ముహూర్తం నిర్ణయించుకున్నట్లు సమాచారం.

More Telugu News