Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హోంవర్క్ చేయలేదని రెండో తరగతి బాలికపై బెంగళూరు ట్యూషన్ టీచర్ ప్రతాపం!... బెల్టుతో బాదిన వైనం!

బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. అప్పుడప్పుడే విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న ఓ చిన్నారి బాలికపై ట్యూషన్ టీచర్ తన ప్రతాపాన్ని చూపాడు. చిన్న పొరపాటుకు నడుముకున్న బెల్టు తీసి ఆ చిన్నారిని బాదేశాడు. వివరాల్లోకెళితే... బెంగళూరుకు చెందిన భావన అనే ఏడేళ్ల బాలిక రెండో తరగతి చదువుతోంది. పాఠశాలలో చెప్పిన పాఠాలపై బాలికకు మరింత అవగాహన రావాలన్న భావనతో తల్లిండ్రులు భావనను ఇంటివద్ద ట్యూషన్ కు కూడా పంపిస్తున్నారు. ఈ క్రమంలో ట్యూషన్ టీచర్ నేటి ఉదయం ఆ బాలికపై బెల్టు తీసి ప్రతాపం చూపాడు. హోంవర్క్ చేయలేదన్న చిన్న కారణంతో బాలికను చితకబాదాడు. దీంతో బాలిక శరీరంపై వాతలు తేలాయి. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ట్యూషన్ టీచర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

More Telugu News